మేడ్చల్:
మేడ్చల్ జిల్లా పరిధిలోని దుండిగల్‌లో 11వ శతాబ్దానికి చెందిన అరుదైన జైన శాసనం (Jain Inscription) వెలుగుచూసింది. దుండిగల్‌లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలో పరిశోధకుడు నరసన్నగారి జగన్ ఈ శాసనాన్ని గుర్తించి, ‘న్యూ తెలంగాణ హిస్టరీ గ్రూప్’ అధ్యక్షుడు హరగోపాల్‌కి సమాచారం అందించారు.
శాసనం వివరాలు & చారిత్రక ప్రాధాన్యత:
- శాసనం స్థితి: ప్రస్తుతం ఈ శాసన స్తంభం మధ్యలోకి విరిగిపోయి ఉంది. గతంలో దిండిలోని ఒక చిన్న చెరువు వద్ద ఉన్న ఈ స్తంభాన్ని ఆలయ ప్రాంగణానికి తీసుకువచ్చినట్లు గుడి పూజారి తెలిపారు.
- లిపి & వివరాలు: ఈ శాసన స్తంభానికి మూడు వైపులా 11వ శతాబ్దానికి చెందిన తెలుగు, కన్నడ లిపిలో 41 లైన్ల రాతలు చెక్కబడి ఉన్నాయి.
- చెక్కబడిన ఆకృతులు: స్తంభంపై సూర్యుడు, చంద్రుడు, జైన తీర్థంకరుని ప్రతిమతో పాటు ఆవు-దూడల ఆకృతులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
- కళ్యాణి చాళుక్యుల కాలం: ప్రాథమిక పరిశోధనల ప్రకారం ఈ శాసనం కళ్యాణి చాళుక్య చక్రవర్తి త్రిభువనమల్లదేవుని (విక్రమాదిత్య VI) కాలానికి చెందినదిగా చరిత్రకారులు నిర్ధారించారు.

