Breaking News

భక్తులకు మెరుగైన వసతులు.. భద్రాచలం అభివృద్ధికి మరింత ప్రాధాన్యత

రూ.1.50 కోట్లతో డార్మెటరీ హాల్‌కు శంకుస్థాపన భద్రాచలం, సెప్టెంబర్ 06:(E6tv NEWS: ప్రతినిధి). రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు తెలిపారు.భక్తుల వసతి కోసం రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న డార్మెటరీ హాల్‌కు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి…

Read More

వ్యవసాయంలో విభిన్న ఉపాధి అవకాశాలపై రైతులకు శిక్షణ

పాల్వంచ: సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాల్వంచ క్లస్టర్ పరిధిలోని కొత్తూరు గ్రామం పేటచెరువు వద్ద ఆత్మ (వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ) ఆధ్వర్యంలో “వ్యవసాయంలో విభిన్న ఉపాధి అవకాశాలు” అనే అంశంపై నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.వ్యవసాయ విస్తరణ అధికారి జి. నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి వి. బాబురావు, మండల వ్యవసాయ అధికారి పి. శంభోశంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ…

Read More

నడిరోడ్డుపై బైక్‌ స్టంట్లు.. యువకుడిపై కేసు

ప్రమాదకర వీలింగ్‌కు పాల్పడుతున్న యువకుడిని పట్టుకున్న మఠంపల్లి పోలీసులు మఠంపల్లి, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). నడిరోడ్డుపై ద్విచక్రవాహనంతో ప్రమాదకరంగా వీలింగ్‌ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న యువకుడిని మఠంపల్లి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మఠంపల్లి ప్రధాన చౌరస్తా నుంచి జాన్‌పాడు, మట్టపల్లి రోడ్డుకు వెళ్లే మార్గంలో పర్వతం గోపీచంద్ (19) అనే యువకుడు ద్విచక్రవాహనంపై అత్యంత ప్రమాదకరంగా స్టంట్లు…

Read More

నిజామాబాద్ రీజియన్ అభివృద్ధికి కార్యాచరణ

ప్రయాణికులకు మెరుగైన సేవలే లక్ష్యం: ఈడీ సోలమన్ నిజామాబాద్, సెప్టెంబర్ 5: (E6tv NEWS; ప్రతినిధి) టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ అభివృద్ధికి పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్ తెలిపారు. నిజామాబాద్ రీజియన్‌లో పర్యటించిన ఆయన వివిధ డిపోల పనితీరును పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్లతో సమావేశమైన ఈడీ సోలమన్.. డిపోల పనితీరును మరింత మెరుగుపరచాలని సూచించారు. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, సమయపాలనతో కూడిన ప్రజా రవాణా…

Read More

బోధన్‌లో నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్

బోధన్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). బోధన్ పట్టణంలోని రాకాసిపేట్‌లో నకిలీ ప్రభుత్వ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి నకిలీ మీ సేవ సర్టిఫికెట్లు, రబ్బర్ స్టాంపులు, కంప్యూటర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. రాకాసిపేట్ పెద్ద మసీదు సమీపంలోని సహారా మీ సేవ కేంద్రంలో నకిలీ ప్రభుత్వ ధ్రువపత్రాలు తయారు చేస్తున్నారనే సమాచారం అందడంతో…

Read More

అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

నాగేంద్రనగర్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి)ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా అర్హులైన పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డుల మంజూరు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హత పొందిన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సందె రంజిత్ మాట్లాడుతూ.. పేద, అర్హత కలిగిన కుటుంబాలకు రేషన్ కార్డు అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రభుత్వ గుర్తింపు పత్రంగా నిలుస్తుందని తెలిపారు….

Read More

ఉనికి కోసమే బీఆర్ఎస్ నాయకుల ఆరాటం

ప్రజా సంక్షేమంపై మరింత నిబద్ధతతో ముందుకు వెళ్తాం: మానాల మోహన్ రెడ్డి నిజామాబాద్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి)  బీఆర్ఎస్ నాయకులు తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా ప్రజల తరఫున అభినందనలు తెలిపారు….

Read More

ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్ హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యం: గణేష్ బిగాల

నిజామాబాద్, సెప్టెంబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి) ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని నిరసిస్తూ నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో శనివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ బైక్ ర్యాలీ సెప్టెంబర్ 5న ఉదయం 10:30 గంటలకు పాత కలెక్టర్ గ్రౌండ్ నుంచి ప్రారంభం కానుంది. యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ఎన్నికల సమయంలో…

Read More

ఇంకా నిరుపేదలు ఉన్నారు.. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న మరో 10 మంది పేదలను ఆదుకోవాలిరోడ్డు పనులు వెంటనే చేపట్టాలి.. అంబం ఆర్ సర్పంచ్, ఉపసర్పంచ్ విజ్ఞప్తి రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి.. అంబం ఆర్ సర్పంచ్, ఉపసర్పంచ్ విజ్ఞప్తి రుద్రూర్, సెప్టెంబర్ 4: (E6tv NEWS: ప్రతినిధి) గ్రామంలో ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం ఆర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కుర్లెపు గంగాధర్ ప్రభుత్వాన్ని కోరారు….

Read More

జీవనశైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు, చికిత్సను విస్తృతం చేయాలి

ప్రతి ఆశా కార్యకర్త రోజుకు 10 మందికి స్క్రీనింగ్‌ చేయాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజశ్రీ నిజామాబాద్, సెప్టెంబర్ 3: (E6tv NEWS: శివ ఠాకూర్). జీవనశైలి వ్యాధులైన హైపర్‌టెన్షన్‌, మధుమేహం, క్యాన్సర్‌ తదితర వ్యాధులను తొలిదశలోనే గుర్తించి చికిత్స అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి. రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జీవనశైలి వ్యాధులపై ఓరియంటేషన్‌ శిక్షణ, సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. డబ్ల్యూహెచ్‌ఓ కన్సల్టెంట్‌ డాక్టర్‌ అబ్దుల్‌ వాసి ముఖ్యఅతిథిగా హాజరై…

Read More