‘మా ఊరంతా మునిగిపోయింది’: అస్సాంను ముంచెత్తిన ఘోర వరదలు.. ఛాతీ లోతు నీటిలో ఐదున్నర లక్షల మంది!
గౌహతి : ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో వరద ఉధృతి అత్యంత దారుణంగా మారింది. ఎన్నడూ లేని విధంగా అప్పర్ అస్సాం జిల్లాలైన శివసాగర్, చరైదేవ్, జోర్హాట్ మరియు గోలాఘాట్‌లను ప్రళయకర వరదలు ముంచెత్తాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే బాధితుల సంఖ్య 3.6 లక్షల నుండి 5.6 లక్షలకు పెరిగిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ ప్రకృతి విపత్తుకు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. “95 ఏళ్ల నా జీవితంలో ఇలాంటి…

