Breaking News

సైబర్ బాధితులకు ఊరట: బాధితుల డబ్బులను రికవరీ చేయడంలో దేశంలోనే తెలంగాణ టాప్!

హైదరాబాద్ :

సైబర్ నేరాల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు తిరిగి వారి సొమ్మును రిఫండ్ (Restoration) చేయించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) క్షేత్రస్థాయి పోలీసు విభాగాలతో కలిసి అత్యంత వేగంగా చర్యలు చేపడుతోంది.

డిజిపి పర్యవేక్షణ &TGCSB వివరాలు:

TGCSB డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపిన వివరాల ప్రకారం:

  • భారీ రికవరీ ఆజ్ఞలు: సైబర్ కేసుల్లో రూ. 9.78 కోట్లకు సంబంధించి ఏకంగా 24,268 కేసుల్లో బాధితులకు డబ్బులను తిరిగి చెల్లించేలా అధికారిక ఆదేశాలు (Court Orders) జారీ చేయించడంలో తెలంగాణ సైబర్ టీమ్ విజయం సాధించింది.
  • జాతీయ స్థాయిలో ప్రతిభ: ‘మనీ రిస్టోరేషన్ మోడ్యూల్’ (MRM) వినియోగంలో తెలంగాణ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. కేవలం MRM మాత్రమే కాకుండా GRM, ‘సమన్వయ్’, ‘సహయోగ్’ వంటి అన్ని సైబర్ సెక్యూరిటీ మాడ్యూళ్లలోనూ తెలంగాణ దేశంలోనే ముందుంజలో ఉందన్నారు.

ఇ-జీరో ఎఫ్‌ఐఆర్ (E-Zero FIR) అందుబాటులోకి:

సైబర్ మోసాల్లో నిర్ణీత పరిమితికి మించి డబ్బు నష్టపోయిన బాధితుల కోసం వ్యవస్థను మరింత వేగవంతం చేశారు.

  • నిర్దేశిత పరిమితి దాటిన కేసుల్లో TGCSB ద్వారా ‘ఈ-జీరో ఎఫ్‌ఐఆర్’ (E-Zero FIR) ఆటోమేటిక్‌గా నమోదు అయ్యేలా చర్యలు చేపట్టారు.

బాధితులకు సూచన: సైబర్ మోసం జరగ్గానే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయడం ద్వారా పోగొట్టుకున్న డబ్బును హోల్డ్‌లో పెట్టి రికవరీ చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *