Breaking News

ఏడేళ్ల తర్వాత ఢిల్లీలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్!

8వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్రమంత్రి జితిన్ ప్రసాద ఘన స్వాగతం పలికారు. భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్న తరుణంలో, దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం జిన్‌పింగ్ చేపట్టిన ఈ భారత పర్యటనకు దౌత్యపరంగా అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.

సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సులో జిన్‌పింగ్ ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో భాగంగ ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన ప్రత్యేకంగా ద్వైపాక్షిక భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీలో సరిహద్దుల్లో శాంతిభద్రతల పరిరక్షణ, వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ, అంతర్జాతీయ పరిణామాలు మరియు ‘గ్లోబల్ సౌత్’ దేశాల ఐక్యత వంటి కీలక అంశాలపై ఇరువురు అగ్రనేతలు చర్చించే అవకాశం ఉంది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా పలువురు ప్రపంచ దేశాధినేతలు హాజరవుతున్న ఈ సదస్సులో మోదీ-జిన్‌పింగ్ భేటీపై అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ చర్చలు భవిష్యత్ ఆసియా దౌత్య, ఆర్థిక సమీకరణాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *