Breaking News

మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి

State Co-operative Union Chairman Manala Mohan Reddy met Minister Ponnam Prabhakar as a courtesy call…

  • పెర్కిట్ రేణుక ఎల్లమ్మ ఆలయ సందర్శన సందర్భంగా శాలువాతో ఘన సత్కారం
  • పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న మర్యాదపూర్వక భేటీ

నిజామాబాద్, జూలై 1:

తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పెర్కిట్‌లోని రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ బలోపేతం వంటి అంశాలపై వారు స్వల్పంగా చర్చించినట్లు తెలిసింది.

ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ సభ్యుడు వేణు యాదవ్, బాల్కొండ మాజీ మండల అధ్యక్షుడు గున్నల వెంకటేష్ గౌడ్, వేల్పూర్ మండల అధ్యక్షుడు అనిల్ గౌడ్, గుమ్మిరియాల సర్పంచ్ సంజీవ్, లక్కోరా ఉప సర్పంచ్ రాము, తోర్తి సర్పంచ్ భూమేశ్వర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రవీణ్ గౌడ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *