Breaking News

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.

కమ్మర్‌పల్లి, తేదీ: 04-07-2026 (E6 న్యూస్ తాటిపల్లి గంగాధర్)

కమ్మర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 5 ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా రైతు భరోసా నిధులు అందుకున్న రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రికి, అలాగే బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి సునీల్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోనగిరి భాస్కర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య, మాజీ అధ్యక్షుడు సుంకేట రవి, కిసాన్ ఖేత్ జిల్లా ఉపాధ్యక్షుడు పడిగెల ప్రవీణ్, మాజీ జిల్లా నాయకుడు తక్కూరి దేవేందర్, హాసకొత్తూర్ సర్పంచ్ నలిమెల గంగారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు కుంట ఆనంద్, బాల్కొండ నియోజకవర్గ యూత్ మాజీ ఉపాధ్యక్షుడు మేడిపల్లి రిత్విక్, టౌన్ అధ్యక్షుడు సాల్లూరి గణేష్, చౌట్‌పల్లి అధ్యక్షుడు రవీందర్, బషీరాబాద్ అధ్యక్షుడు నర్రా భూమేష్, మండల యూత్ ఉపాధ్యక్షుడు శైలేందర్, మండల కోశాధికారి బుచ్చి మల్లయ్య, సింగిరెడ్డి శేఖర్, బాలయ్య, రాజేందర్, వన్నెల దేవేందర్, సంజీవ్, నరేష్, జగదీష్, శివశరణ్, నరేష్‌తో పాటు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *