నిజామాబాద్, జూలై 7: E6 న్యూస్(శివ ఠాకూర్).
ప్రయాణికులు, వ్యాపారులు, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో టీజీఎస్ఆర్టీసీ కార్గో పార్సిల్ సేవల ఛార్జీలపై 10 శాతం తగ్గింపు అమలు చేస్తున్నట్లు నిజామాబాద్-1 డిపో మేనేజర్ తెలిపారు.
ఈ అవకాశాన్ని ప్రజలు, వ్యాపారులు వినియోగించుకొని తక్కువ ఖర్చుతో కార్గో, పార్సిల్ సేవలను పొందాలని ఆయన సూచించారు.
అదేవిధంగా, నిజామాబాద్-1 డిపో కార్గో కార్యాలయంలో ఉన్న క్లెయిమ్ చేయని (Unclaimed) పార్సిళ్ల వేలంను జూలై 7, 2026న మధ్యాహ్నం 3.00 గంటలకు నిజామాబాద్ బస్టాండ్‌లోని కార్గో కార్యాలయం ఎదుట నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆసక్తి గల ప్రజలు, వ్యాపారులు నిర్ణీత సమయానికి హాజరై వేలంలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కోరారు.

