Breaking News

కొత్త హెచ్ఐవీ కేసులను త్వరగా గుర్తించాలి

నిర్దేశిత లక్ష్యాన్ని సాధించేందుకు సమన్వయంతో పనిచేయాలి

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ

నిజామాబాద్: E6 న్యూస్: శివ ఠాకూర్

జిల్లాలో ఇంకా గుర్తించాల్సిన హెచ్ఐవీ కేసులను త్వరితగతిన గుర్తించి, బాధితులను చికిత్స పరిధిలోకి తీసుకురావాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ సూచించారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మొబిలైజేషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమంపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డాక్టర్ రాజశ్రీ అధ్యక్షత వహించి కార్యక్రమ అమలు, లక్ష్యాల సాధనపై అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ 2026 డిసెంబర్ 1 వరకు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం, నిజామాబాద్ జిల్లాలో 0.32 శాతం హెచ్ఐవీ ప్రివలెన్స్ ఆధారంగా సుమారు 5,874 మంది హెచ్ఐవీతో జీవిస్తున్నట్లు అంచనా ఉందన్నారు. వీరిలో 95 శాతం, అంటే 5,580 మందికి తమ హెచ్ఐవీ స్థితి తెలిసి ఉండాలనే లక్ష్యం నిర్దేశించినట్లు తెలిపారు.

ప్రస్తుతం జిల్లాలో 5,451 మందికి, అంటే 93 శాతం మందికి హెచ్ఐవీ స్థితి గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇంకా గుర్తించాల్సిన 136 హెచ్ఐవీ కేసులను త్వరగా గుర్తించి, వారందరినీ చికిత్స పరిధిలోకి తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించారు.

హెచ్ఐవీపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. హెచ్ఐవీ సంక్రమణ ప్రమాదం అధికంగా ఉన్న జనాభాను గుర్తించి, అన్ని విభాగాల సిబ్బంది టీమ్‌వర్క్‌తో పనిచేసి నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ దేవి నాగేశ్వరి, మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్, డీపీఎం సుధాకర్, సీఎస్‌వో నవీన్, సీపీఓ మొహీజ్ అహ్మద్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం సిబ్బంది, టీబీ నియంత్రణ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *