ముధోల్: జులై 9 : E6 న్యూస్, తిరుపతి గౌడ్.
శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి గణిత, విజ్ఞాన, సాంస్కృతిక మేళా ఏర్పాట్లపై ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిరంలో విజ్ఞాన మేళా యోజన బైఠక్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం నిర్వహించిన ప్రార్థన కార్యక్రమంలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి పతకమూరి శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. అనంతరం ప్రాంత విజ్ఞాన మేళా యోజన, సంకుల ప్రధానాచార్యులు, స్థానిక పాఠశాల ఆచార్యులతో సమావేశాలు నిర్వహించి మేళా నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.
ఆగస్టు 30, 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ప్రాంత స్థాయి గణిత, విజ్ఞాన, సాంస్కృతిక మేళాను నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. మేళాను విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, విద్యార్థుల భాగస్వామ్యం, వివిధ అంశాలపై సమావేశంలో చర్చించారు.
కార్యక్రమంలో ప్రాంత శైక్షణిక్ సంయోజక్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, ప్రాంత సహ శైక్షణిక్ సంయోజక్ కడారి కుమార్, విభాగ్ కార్యదర్శి సరుకొండ దామోదర్, విభాగ్ శైక్షణిక్ సంయోజక్ కలిమహంతి వేణుమాధవ్, జిల్లా ఉపాధ్యక్షుడు ధర్మపురి సుదర్శన్, జిల్లా కార్యదర్శి పురస్తు గోపాల్ కిషన్, పాఠశాల అధ్యక్షుడు కొండావార్ సంజీవ్, కార్యదర్శి వేదపాఠక్ నిశికాంత్తో పాటు పాఠశాల సమితి, ప్రబంధకారిణి సభ్యులు, జిల్లాలోని వివిధ పాఠశాలల ప్రధానాచార్యులు, ఆచార్యులు పాల్గొన్నారు.

