Breaking News

నందిపేట్‌లో జర్నలిజం ముసుగులో పర్సంటేజీల దందా..?

విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ఏజెన్సీల నుంచి శాతం % వసూళ్ల ఆరోపణలు

నందిపేట్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్

నందిపేట్ మండలంలో ఓ ప్రముఖ పత్రికలో  సంవత్సరాలుగా పనిచేస్తున్న విలేఖరిపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి, మండల కేంద్రంలో ఉన్న ప్రజల వద్ద నుండి  పర్సంటేజీలు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. స్వతహాగా నందిపేట్ నివాసి అయిన విలేకరి నందిపేట్ మండల కేంద్రం నుండి నిజామాబాద్ నగరానికి, నగరం నుండి నందిపేట్ మండల కేంద్రానికి ప్రతిరోజూ ప్రయాణం సాగిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా మండలాన్ని తన గుప్పెట్లో ఉంచుకొని మండలంలో గల విద్యాసంస్థలు, ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్ లు,ల్యాబ్‌లలో వివిధ ఏజెన్సీలతో సంబంధాలు కొనసాగిస్తూ ఐదు నుంచి పది శాతం వరకు వాటా తీసుకుంటున్నాడని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. చూడడానికి భూమికి జానడుగా ఉన్న తన పనులు మాత్రం భూలోక వీరుడుగా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విధానం. చాలా కాలంగా కొనసాగుతుందని పలువురు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *