Breaking News

కాంగ్రెస్ పార్టీలో చేరిన కులస్పూర్ గ్రామ సర్పంచ్ గుడి జనార్దన్ రెడ్డి

నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్

మోపాల్ మండలంలోని కులస్పూర్ గ్రామ సర్పంచ్ గుడి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరగా, ఎమ్మెల్యే ఆయనకు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విశ్వసించి పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. పార్టీలో చేరిన వారికి తగిన గౌరవం, ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, తాడేం గ్రామ సర్పంచ్ జిలేందర్ రెడ్డి, మోపాల్ మండల మైనారిటీ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, నిమ్మల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *