సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన ‘వన్ వార్డ్ ఎవ్రీ డే’ (One Ward Every Day) కార్యక్రమంలో భాగంగా బుధవారం కమిషనర్ జి. శ్రీజన నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని వార్డులో విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, కాలనీ సంక్షేమ సంఘాల (RWA) ప్రతినిధులతో కమిషనర్ ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించి, వార్డు పరిధిలోని పౌర సమస్యలు మరియు జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు.
చర్చించిన ప్రధాన సమస్యలు:
- డ్రైనేజీ & మ్యాన్‌హోల్స్: దెబ్బతిన్న మ్యాన్‌హోళ్ల మరమ్మతులు, మురుగునీటి డ్రైనేజీ అవరోధాలను (Drainage blockages) వెంటనే తొలగించడం.
- రహదారుల అభివృద్ధి: గోకరాజు రోడ్డు పునరుద్ధరణ, రోడ్ల విస్తరణ, గుంతల పూడ్చివేత మరియు నీటి నిల్వ సమస్యలను నివారించడం.
- వీధి దిపాలు & చెత్త సేకరణ: వీధిదీపాల సమస్యలు, డోర్-టు-డోర్ చెత్త సేకరణ సమర్థవంతంగా నిర్వహించడం, రోడ్ల ఊడ్చివేత (Road sweeping) ను వేగవంతం చేయడం.
- ఎఫ్ఓబీ (FOB) నిర్మాణం & ఆక్రమణలు: బెవర్లీ పామ్స్ సమీపంలో పదాచారుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (Foot Over Bridge) ఏర్పాటు మరియు ఆక్రమణల తొలగింపు.
- ఎస్టీపీ స్లడ్జ్ నిర్మూలన: ఎస్టీపీ (STP) స్లడ్జ్‌ను శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసి తొలగించడం.
కమిషనర్ ఆదేశాలు:
ప్రజలు మరియు నివాస సంఘాల ప్రతినిధులు లేవనెత్తిన ప్రతి సమస్యపై ఆయా సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని కార్పొరేషన్ కమిషనర్ జి. శ్రీజన అధికారులను ఆదేశించారు.

