వర్షాలతో ఇల్లు కూలిన బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం
అధికారులకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం

ఇందూరు, ఆగస్టు 1: E6 tv NEWS, శివ ఠాకూర్.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. శనివారం నగరంలోని 42వ డివిజన్ చంద్రశేఖర్ కాలనీలో భారీ వర్షాలకు షేక్ ఫిరోజ్ నివాసం కూలిపోవడంతో బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు.ఈ సందర్భంగా బాధితుల పరిస్థితిని తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. వర్షాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే సంబంధిత అధికారులు, స్థానిక కార్పొరేటర్లకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
అనంతరం బాధిత కుటుంబానికి నెలవారీ నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, అవసరమైన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ కార్పొరేటర్ బెల్లాల్ శశాంక్, 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ, పసునూరి రాము, జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, ప్రసూన శ్రీనివాస్, శ్యామల సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు.


