జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ చేతుల మీదుగా పంపిణీ
ప్రతి అర్హ కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి
జుక్కల్ ఆగస్టు 1: (E6 tv NEWS ప్రతినిధి).
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 100 శాతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న గోడ గడియారాల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పాల్గొని లబ్ధిదారులకు గోడ గడియారాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ప్రతి సంక్షేమ పథకం నిజమైన లబ్ధిదారులకు చేరేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన లబ్ధిదారులకు ప్రభుత్వం గుర్తుగా గోడ గడియారాలను అందజేయడం సంతోషకరమైన విషయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

