ఆగస్టు 2: (E6 tv NEWS ప్రతినిధి).
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్పల్లి నగేష్ రెడ్డి, రాష్ట్ర పీఏసీ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మాజీ పార్టీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, పురన్ రెడ్డి, విద్యాసాగర్ తదితరులు సుదర్శన్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజాసేవలో సుదర్శన్ రెడ్డి మరింత ఉన్నత స్థానాలకు ఎదిగి, ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు బోధన్ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేస్తున్న సేవలు కొనసాగాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

