నిజాంసాగర్, ఆగస్టు 3: E6 tv NEWS ప్రతినిధి.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి గ్రామపంచాయతీ పరిధికి చెందిన 10వ వార్డు సభ్యుడు బాబు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ సోమవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు బంజపల్లి గ్రామ సర్పంచ్ ఏలే సుగుణమ్మ కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా వార్డు సభ్యుడు బాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న డీసీసీ అధ్యక్షులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.అవసరమైతే జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి, మెరుగైన వైద్య చికిత్స కోసం అవసరమైన ఎల్ఓసీ (Letter of Credit) మంజూరుకు కృషి చేస్తానని ఏలే మల్లికార్జున్ తెలిపారు.ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


