Breaking News

బాల్కొండ నియోజకవర్గ ఆరోగ్య రంగ అభివృద్ధికి 10 కీలక ప్రతిపాదనలు

ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వినతి అందజేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 3: E6 tv NEWS ప్రతినిధి.

హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన నిజామాబాద్ జిల్లా ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ ఆరోగ్య రంగ అభివృద్ధికి సంబంధించిన పది కీలక ప్రతిపాదనలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి, వాటికి తక్షణ పరిపాలనా అనుమతులు, నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

సమావేశంలో నియోజకవర్గాల వారీగా ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు, మౌలిక సదుపాయాలు, మందుల లభ్యత, వైద్యులు, సిబ్బంది అందుబాటు, ప్రజారోగ్య సేవల మెరుగుదల వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.

ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన ప్రధాన ప్రతిపాదనలు ఇవి:

భీంగల్‌లో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఏరియా ఆసుపత్రి పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు.

భీంగల్‌లో ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాహత్‌నగర్‌కు తరలించి, అక్కడ కొత్త పీహెచ్‌సీ భవనం నిర్మాణానికి పరిపాలనా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

భీంగల్ పట్టణంలో కొత్త అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) ఏర్పాటు చేయాలని కోరారు.

మోర్తాడ్ మండలంలోని పాలెం లేదా తిమ్మాపూర్ గ్రామంలో కొత్త పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

బాల్కొండ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు కొత్త భవనం నిర్మించేందుకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు.బాల్కొండ, మోర్తాడ్ మండలాల్లో కొత్త పోస్టుమార్టం భవనాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

బాల్కొండ, మోర్తాడ్ మండలాల్లో కొత్త పోస్టుమార్టం భవనాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.నియోజకవర్గంలోని 24×7 పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో అవసరమైన సిబ్బంది పోస్టులు మంజూరు చేసి ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు.

నియోజకవర్గంలోని 24×7 పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో అవసరమైన సిబ్బంది పోస్టులు మంజూరు చేసి ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు.

తొమ్మిది ఆరోగ్య ఉపకేంద్రాల భవనాలకు సంబంధించిన ఎన్‌హెచ్‌ఎం (NHM) పెండింగ్ నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

18 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (AAM)/ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసి నిధులు విడుదల చేయాలని కోరారు.

అలాగే నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఎంఆర్ఐ (MRI) యంత్రాన్ని మంజూరు చేయడంతో పాటు ఖాళీ పోస్టులను భర్తీ చేసి అత్యవసర అవసరాలకు నిధులు కేటాయించాలని ఆరోగ్య శాఖ మంత్రిని కోరారు.

బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలు చేసినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం వీటిపై సానుకూలంగా స్పందించి త్వరితగతిన అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *