భీమ్‌గల్, ఆగస్టు 12: E6 tv NEWS(T. గంగాధర్)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా భీమ్‌గల్ పట్టణంలో మంగళవారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు.పట్టణంలోని సుదర్శన్ థియేటర్ నుంచి సుమంగళి చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. ప్రజలు, యువత, మహిళలు, వివిధ వర్గాల ప్రజలతో పాటు శ్రీ సరస్వతి విద్యామందిర్ ఉన్నత పాఠశాల, శ్రీ నారాయణ పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతబట్టి ‘భారత్ మాతాకీ జై’, ‘వందే మాతరం’ నినాదాలతో దేశభక్తిని చాటుకున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు ఆరే రవీందర్ మాట్లాడుతూ జాతీయ జెండా దేశ గౌరవానికి, ఐక్యతకు ప్రతీక అని అన్నారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తి భావాన్ని మరింత బలపరచాలని పిలుపునిచ్చారు.కుల, మత, రాజకీయ భేదాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా పాల్గొని తిరంగా ర్యాలీని విజయవంతం చేసినందుకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యోగేశ్వర నరసయ్య, కైరి దశ గౌడ్, బండారి లక్ష్మణ్ గౌడ్, తోట గంగాధర్, కొట్టాల అశోక్, పతాని ప్రవీణ్, శెట్టి ప్రేమ్‌చంద్, డాక్టర్ నవీన్, దయ్య ప్రవీణ్, ఈర్ల మహేందర్, ధర్పల్లి మహిపాల్, రాజేష్ గుప్తా, నీలం గంగాధర్, శెట్టి లక్ష్మణ్, ప్రమోద్, యోగిని శ్రీనివాస్, ఈశ్వర్ సాయి, నవతేజ్, వినాయక రమేష్, ముమ్మారి గంగాధర్, డాక్టర్ వెంకటేష్, డిస్చారి, శుక్రవారం గంగాధర్‌తో పాటు యువకులు, వివిధ పార్టీల నాయకులు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.


