Breaking News

తెలంగాణను హెచ్‌ఐవీ రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: హెచ్‌ఐవీ, ఎయిడ్స్, సిఫిలిస్ వంటి వ్యాధుల నివారణ, ముందస్తు గుర్తింపు మరియు చికిత్సపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు హైదరాబాద్‌లోని హెచ్‌ఎమ్‌డీఏ (HMDA) మైదానం నుంచి నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1,500 మంది పాల్గొన్నారు.

“బీ పాజిటివ్ – స్టాప్ హెచ్‌ఐవీ పాజిటివ్” (Be Positive – Stop HIV Positive) అనే నినాదంతో తెలంగాణను హెచ్‌ఐవీ రహిత రాష్ట్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ, తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయని మంత్రి తెలిపారు.

ముఖ్యాంశాలు:

  • రెండు నెలల అవగాహన కార్యక్రమాలు: ఆగస్టు 12 నుంచి రెండు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా విసృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
  • డ్రగ్ ఫ్రీ తెలంగాణ: ఎయిడ్స్ రహిత తెలంగాణతో పాటు మత్తు పదార్థాలు లేని (Drug-Free), ఆరోగ్యకరమైన తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
  • తల్లి నుండి బిడ్డకు సంక్రమించకుండా చికిత్స: హెచ్‌ఐవీ సోకిన తల్లుల నుంచి పుట్టబోయే బిడ్డలకు వైరస్ వ్యాపించకుండా నిరోధించేందుకు అవసరమైన అత్యాధునిక వైద్య సేవలు, ఉచిత చికిత్స అందుబాటులో ఉన్నాయని మంత్రి వెల్లడించారు.
  • ఆందోళన వద్దు: హెచ్‌ఐవీ పట్ల అనవసర భయాలు, ఆందోళన వీడి.. పరీక్షలు, నివారణ మరియు చికిత్స విధానాలపై సరైన అవగాహన పెంపొందించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *