Breaking News

ఆర్మీ నియామకాల కోసం సైన్యంతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్ధం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్:

భారత సైన్యంలో చేరేందుకు తెలంగాణ యువతను ప్రోత్సహించేందుకు ఆర్మీ అధికారులతో కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం తెలిపారు. స్థానిక యువతలో అవగాహన పెంచి, ఆర్మీ నియామకాల్లో వారు అర్హత సాధించేలా జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఆయన సైనిక అధికారులకు విజ్ఞప్తి చేశారు.

భారత సైనిక దళాల సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ (GOC-in-C) లెఫ్టినెంట్ జనరల్ సి. రాజేష్ పుష్కర్ బుధవారం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సైనిక నియామకాలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు.

భేటీలోని ముఖ్యాంశాలు:

  • ఆర్మీ శిక్షణా కేంద్రాల ఏర్పాటు: సీఎం ప్రతిపాదనకు లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ సానుకూలంగా స్పందించారు. దేశవ్యాప్త ఆర్మీ నియామక ర్యాలీలకు ముందుగా తెలంగాణలోని వివిధ జిల్లా కేంద్రాల్లో యువతకు శిక్షణ నిచ్చే కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
  • విపత్తు నిర్వహణలో ఆర్మీ పాత్ర: వరదలు మరియు ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక చర్యల్లో పాలుపంచుకోవడం వంటి అంశాల్లో ఆర్మీ మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని సీఎం కోరారు. దీనికి స్పందించిన ఆర్మీ అధికారి.. అత్యవసర సమయాల్లో ప్రత్యేక చొరవ చూపాలని స్థానిక అధికారులను ఆదేశిస్తామని హామీ ఇచ్చారు.
  • మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై ప్రశంస: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్’ను లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ అభినందించారు. కాలుష్యాన్ని తగ్గించి, హైదరాబాద్ నగారానికి పూర్వ వైభవాన్ని తేవడానికి మరియు నగరాన్ని కాపాడుకోవడానికి మూసీ ప్రక్షాళన ప్రస్తుత కాలంలో అత్యంత అవసరమని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *