Breaking News

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పలు ప్రాంతాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల

నిజామాబాద్, ఆగస్టు 15: (E6 tv NEWS: శివ ఠాకూర్).

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిజామాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.

బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

ఎల్లమ్మగుట్టలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీ జీవన్ రెడ్డితో కలిసి గణేష్ బిగాల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆర్ఆర్ చౌరస్తా శివాజీ చౌక్‌లో సిర్ప రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

పలు ప్రాంతాల్లో జాతీయ పతాకావిష్కరణ

జూబ్లీ హోటల్ చౌరస్తా, ఖిల్లా రోడ్‌లో బీఆర్ఎస్ నాయకులు అబ్దుల్ మతీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో, దారుగల్లిలో 58వ డివిజన్ అధ్యక్షుడు సమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గణేష్ బిగాల జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అర్సపల్లిలోని నిజాం కాలనీ మెయిన్ రోడ్‌లో 15వ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు ముస్తాక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు.

దేశ ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాల్లో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, NUDA మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాష్, సుజిత్ సింగ్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *