Breaking News

విధి నిర్వహణలో ప్రతిభకు గుర్తింపు

TSNPDCL ఏఈ సంజీవ్ కుమార్‌కు ప్రశంసా పత్రం

నిర్మల్ ఆగస్టు 15: (E6 tv NEWS ప్రతినిధి).

నిర్మల్ జిల్లా కేంద్రంలోని కాలేజ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బిపేష్ మిశ్రా, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ శాఖల్లో విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను అధికారులు సన్మానించారు. ఇందులో భాగంగా TSNPDCLలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న సంజీవ్ కుమార్కు విధి నిర్వహణలో చూపిన ప్రతిభ, సేవలను గుర్తిస్తూ ప్రశంసా పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా సంజీవ్ కుమార్‌ను అధికారులు, సహచర ఉద్యోగులు అభినందించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *