Breaking News

వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

మద్నూర్, ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి).
మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం గాంధీ చౌక్ ఆవరణలో గ్రామ పెద్దలు, వ్యాపారవేత్తల కుటుంబాలకు చెందిన మహిళామణుల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటే కార్యక్రమాలు నిర్వహించారు.

కార్మెల్ ప్రైవేట్ స్కూల్ విద్యార్థినులు ప్రదర్శించిన ఆకట్టుకునే నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలను గ్రామ ప్రజలు ఆసక్తిగా తిలకించి అభినందించారు.స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గ్రామంలో దేశభక్తి వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వ్యాపారవేత్తలు, మహిళలు, విద్యార్థులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *