ఎర్గట్ల, ఆగస్టు 15: (E6tv NEWS: T. గంగాధర్).
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎర్గట్ల మండలానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎర్గట్ల గ్రామానికి చెందిన శ్రీమతి జుంగాల గంగు, శ్రీమతి హుస్సేన్ బీకి వేదికపై స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో ఎర్గట్ల తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ రమేష్, మండల రెవెన్యూ పరిశీలకులు రవి, జీపీవోలు వెంకటేష్, సంపత్, భూమన్న, మధు తదితర అధికారులు, అలాగే ఎర్గట్ల మండలంలోని అన్ని రేషన్ దుకాణాల డీలర్లు పాల్గొన్నారు.
త్వరలో గ్రామాల్లో పంపిణీ
ఎర్గట్ల మండలంలోని మిగతా అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం నిర్ణయించిన తేదీల ప్రకారం ఆయా గ్రామాల్లో స్మార్ట్ రేషన్ కార్డులను త్వరలో పంపిణీ చేయనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. లబ్ధిదారులు సంబంధిత అధికారులు, రేషన్ డీలర్ల ద్వారా సమాచారం తెలుసుకుని నిర్ణీత తేదీల్లో కార్డులను స్వీకరించాలని సూచించారు.

