Breaking News

అవల్‌గావ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మద్నూర్, ఆగస్టు 15: (E6 tv NEWS ప్రతినిధి).

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం అవల్‌గావ్ గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ మాన్యబాయి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ గ్రామ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.గ్రామాభివృద్ధిలో భాగస్వాములైన మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు, వ్యవసాయ శాఖ ఏఈఓ, లైన్మెన్, ఆశా వర్కర్లు, పాఠశాల చైర్మన్ తదితరులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.

ఈ సందర్భంగా మాజీ ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించిన సర్పంచ్ మాన్యబాయి.. రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. గ్రామ సమస్యల పరిష్కారం, ప్రజల సంక్షేమం కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ నాగనాథ్ పటేల్, మాజీ ఎంపీటీసీలు సాయిలు, రాయపా పటేల్, మాజీ సర్పంచ్ శాంతేష్వర్, మరోతి భూమా, మాజీ జడ్పీటీసీ బస్వరాజ్ పటేల్‌తో పాటు వారి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *