Breaking News

వందేమాతరం గీతం ప్రతి భారతీయుడి గుండెల్లో నిలవాలి

నిజామాబాద్, ఆగస్టు 17: (E6 tv NEWS: శివ ఠాకూర్).

బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట సోమవారం వందేమాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో వందేమాతరం గీతం కీలక పాత్ర పోషించిందన్నారు.

1905 బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందేమాతరం గీతం రణనినాదంగా మారి ప్రజలను చైతన్యవంతం చేసిందని తెలిపారు. బంకించంద్ర చటర్జీ దూరదృష్టితో వందేమాతరం గీతాన్ని రచించి స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారని పేర్కొన్నారు.వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి భారతీయుడు దాని చరిత్రను తెలుసుకుని, దేశభక్తి స్ఫూర్తితో ముందుకు సాగాలని వంశీ గౌడ్ పిలుపునిచ్చారు. వందేమాతరం గీతాన్ని అధికారిక కార్యక్రమాల్లో పూర్తిగా ఆలపించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఒక వర్గాన్ని సంతృప్తిపరిచేందుకు పూర్తి వందేమాతరం గీతాన్ని ఆలపించకుండా అడ్డుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని చెప్పుకునే నాయకులు వందేమాతరం గీతాన్ని ఆలపించకుండా ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

వందేమాతరం గీతం కుల, మతాలకు అతీతంగా ప్రతి భారతీయుడి హృదయంలో నిలవాలని వంశీ గౌడ్ అన్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను పెంపొందించే కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సుధీర్, చిరంజీవి, శశాంక్, శ్రావణ్, బీజేవైఎం నాయకులు విపుల్, ప్రశాంత్, రాజశేఖర్, మహేష్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *