Breaking News

పొనకల్–హైదరాబాద్ బస్సు సర్వీసు పునరుద్ధరించాలి

ఎర్గట్ల, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).
పొనకల్ గ్రామం నుంచి హైదరాబాద్‌కు నిలిపివేసిన బస్సు సర్వీసును వెంటనే పునరుద్ధరించాలని ఎర్గట్ల మండల సర్పంచులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డికి సర్పంచులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ, పొనకల్ నుంచి హైదరాబాద్‌కు నడిచే బస్సు సర్వీసు నిలిపివేయడంతో ఎర్గట్ల, మోర్తాడ్, వేల్పూర్ మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతంలో దోంచందా సీబీఎస్ బస్సు, గుమ్మిర్యాల్ నైట్ బస్సు సౌకర్యం ఉండేదని, ప్రస్తుతం నైట్ బస్సు లేక రైతులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

మూడు మండలాల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పొనకల్ నుంచి నిజామాబాద్‌కు రోజుకు కనీసం రెండు నుంచి మూడు ట్రిప్పులు నడిపించాలని కోరారు. అలాగే గుమ్మిర్యాల్ ప్రాంతానికి నైట్ హాల్ట్ బస్సును తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సరైన బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిలిపివేసిన బస్సు సర్వీసులను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు దేశబోయిన జమున, సంజీవ్ యాదవ్, కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, భూషణవేణి ప్రవీణ్ యాదవ్, ఉపసర్పంచ్ చాట్ల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *