పెద్దకొడప్గల్, ఆగస్టు 21: (E6tv NEWS: ప్రతినిధి).
కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ భాస్కర్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు వైద్యులు గ్రామానికి వచ్చి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ భాస్కర్ మాట్లాడుతూ వర్షాకాలంలో దోమల కారణంగా వివిధ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్‌ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి తమ సమస్యలను వివరించాలని, వైద్యుల సూచన మేరకు అవసరమైన మందులు పొందాలని తెలిపారు.
గ్రామస్థులకు అందుబాటులో వైద్య సేవలు కల్పించేందుకు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాస్కర్‌తో పాటు వైద్యులు మనీలా, బుజ్జి, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

