నిజామాబాద్, ఆగస్టు 25: (E6tv NEWS: ప్రతినిధి).
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఐడీఓసీ హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. గవర్నర్‌కు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పి. రాకేష్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదినం కావడంతో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ అరవింద్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు.గవర్నర్ రాక సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. అనంతరం గవర్నర్ తన పర్యటనలో భాగంగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

