జుక్కల్, ఆగస్టు 26: (E6tv NEWS: ప్రతినిధి).
జుక్కల్ నియోజకవర్గంలోని ముస్లిం సోదర, సోదరీమణులకు జాష్నే ఈద్ మిలాద్-ఉన్-నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జుక్కల్ మండల కేంద్రంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.జామియా మజీద్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఖాతిజా మజీద్ వరకు కొనసాగింది. అనంతరం తిరిగి జామియా మజీద్‌కు చేరుకున్నారు. ర్యాలీలో మత పెద్దలు, గ్రామ యువత, చిన్నారులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ.. మహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చూపిన శాంతి, ప్రేమ, సోదరభావం, మానవత్వం, పరస్పర గౌరవం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. పవిత్ర మిలాద్-ఉన్-నబీ పర్వదినం ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, ఐక్యత, ఆరోగ్యం, అభివృద్ధిని నింపాలని ఆకాంక్షించారు.కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జుక్కల్ గ్రామ సర్పంచ్ శ్రీమతి సావిత్రి సాయగౌడ్, బస్వాపూర్ గ్రామ సర్పంచ్ డబ్ల్యూ. రమణ సురేష్ గొండ, డీసీసీ ప్రధాన కార్యదర్శి షేక్ ఇమ్రాన్, జుక్కల్ ఉపసర్పంచ్ షేక్ ఫిర్దోస్, మైనారిటీ అధ్యక్షులు షాదుల్, మిలాద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ షాఖిల్, మత పెద్దలు, చిన్నారులు, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు.

