Breaking News

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు

నిజామాబాద్, ఆగస్టు 27:(E6tv NEWS: ప్రతినిధి)

రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.పండుగ నేపథ్యంలో బస్టాండ్లు, ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాల్లో టీజీఎస్‌ఆర్టీసీ సూపర్‌వైజర్లు, ప్రత్యేక అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన ప్రాంతాల్లో అదనపు బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులను సురక్షితంగా వారి స్వస్థలాలకు చేరవేస్తున్నారు.

ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన రవాణా సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారు. పండుగ సందర్భంగా ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ నిరంతరం సేవలు అందిస్తున్నామని టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ తరఫున ప్రయాణికులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *