నిజామాబాద్, సెప్టెంబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి) ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని నిరసిస్తూ నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో శనివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు.
ఈ బైక్ ర్యాలీ సెప్టెంబర్ 5న ఉదయం 10:30 గంటలకు పాత కలెక్టర్ గ్రౌండ్ నుంచి ప్రారంభం కానుంది. యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
బైక్ ర్యాలీ రూట్
పాత కలెక్టర్ గ్రౌండ్ నుంచి ప్రారంభమై → ఫూలాంగ్ ఎక్స్ రోడ్ → వర్ని ఎక్స్ రోడ్ → ఖిల్లా ఎక్స్ రోడ్ → పవన్ టాకీస్ రోడ్ → నెహ్రూ పార్క్ → బస్ స్టాండ్ మీదుగా తిరిగి పాత కలెక్టర్ గ్రౌండ్‌కు చేరుకోనుంది.ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు, యువత సహకరించాలని కోరారు.ఈ బైక్ ర్యాలీకి మీడియా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని కవర్ చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

