భీంగల్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి)
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 1000 రోజుల ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6వ తేదీ ఆదివారం భీంగల్ మండల కేంద్రంలో బైక్ ర్యాలీ, సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్, డీసీసీ అధ్యక్షుడు కట్పల్లి నగేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.అలాగే భీంగల్ మండలానికి చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సమయానికి సహస్ర ఫంక్షన్ హాల్‌కు చేరుకుని కార్యక్రమాన్ని కవర్ చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

