కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులు అర్పించిన కొత్వాల దంపతులు.
పాల్వంచ, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి).
పాల్వంచ పట్టణ పరిధిలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను డీసీఎంఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు, పాతపాల్వంచ 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి ఆదివారం పరామర్శించారు. ఆయా కుటుంబాల్లో నిర్వహించిన దశదినకర్మలు, చిన్నకర్మ కార్యక్రమాల్లో పాల్గొని మృతులకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
పాల్వంచకు చెందిన వ్యాపారవేత్త, మాధురి ఎంటర్‌ప్రైజెస్ అధినేత మల్లంపాటి వెంకటేశ్వరరావు ఇటీవల మృతి చెందగా, ఆదివారం నిర్వహించిన ఆయన దశదినకర్మలో కొత్వాల దంపతులు పాల్గొని నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అలాగే పాతపాల్వంచకు చెందిన కేటీపీఎస్ కార్మిక నాయకులు ముత్యాల కోటేశ్వరరావు మృతి చెందడంతో ఆయన స్వగృహంలో నిర్వహించిన చిన్నకర్మ కార్యక్రమంలో కొత్వాల దంపతులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు.
పాల్వంచ టీచర్స్ కాలనీకి చెందిన యనగంటి కాంతమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా కూడా కొత్వాల దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె కుమారుడు చంద్రశేఖర్ (బాజీ)తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమాల్లో మాజీ కౌన్సిలర్ కొత్వాల సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ యర్రంశెట్టి ముత్తయ్య, బూసి శ్రీను, వజ్జల రాము, ధర్మరాజుల రమేష్, కొండూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.






