పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు
పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో తిరస్కరించబడిన ఓట్లను పునరుద్ధరించుకోవాలని పాల్వంచ సొసైటీ అధ్యక్షులు, డీసీఎస్‌ఎంఎస్ మాజీ ఛైర్మన్, రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు సూచించారు. పాత పాల్వంచలోని 78, 79, 80, 81 పోలింగ్ బూత్‌ల పరిధిలోని ఓటర్లతో బీఎల్‌ఓలు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ.. ఓటు హక్కు ఎంతో పవిత్రమైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎస్‌ఐఆర్‌లో తమ ఓటు తిరస్కరించబడిన వారు, జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉన్న వారు ఎన్నికల సంఘం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకుని ఫిర్యాదులు, అభ్యంతరాలు దాఖలు చేయాలని సూచించారు.ఎన్నికల సంఘం అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ గడువును అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించిందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కొత్వాల కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
సమావేశంలో 46వ డివిజన్ (78, 79 బూత్‌లు) కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి, 47వ డివిజన్ (80, 81 బూత్‌లు) కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు (జీవీఆర్), అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ కె. పురుషోత్తం, పట్టణ ఆర్‌ఐ సూపర్‌వైజర్ ఎస్. రవికుమార్, బీఎల్‌ఓలు బి. చందర్కర్, రచ్చా వరుణ్, వాసుమల్ల నాగమణి, పద్మ, బీఎల్‌ఏలు ఎస్. ఖాజామియా, మసనం శరత్, నిమ్మల నాగమణి, ముత్యాల పుష్ప, కాంగ్రెస్ నాయకులు కొండం వెంకన్నగౌడ్‌తో పాటు గ్రామస్తులు సయ్యద్ యాకూబ్, రహ్మాన్, కరీం, బూసి శ్రీను, కటారు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.



