25 మంది స్వచ్ఛందగా రక్తదానం
నిజామాబాద్, సెప్టెంబర్ 8: (E6tv NEWS: శివ ఠాకూర్).
నిజామాబాద్ ఫిజియోథెరపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా నిజామాబాద్ మేయర్ ఉమారాణి, నుడా చైర్మన్ కేశ వేణు, హైకోర్టు అడ్వకేట్ పుల్లెల శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.
ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో అసోసియేషన్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని మొత్తం 25 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.ఈ సందర్భంగా ఫిజియోథెరపీ సేవల ప్రాధాన్యత, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఫిజియోథెరపిస్టుల పాత్రపై కార్యక్రమంలో చర్చించారు. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అతిథులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో నిజామాబాద్ ఫిజియోథెరపీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జి. శివకుమార్ పి.టి., జనరల్ సెక్రటరీ డాక్టర్ జి. ప్రమోద్ కుమార్ పి.టి., కోశాధికారి డాక్టర్ ఎం. కీర్తి గుప్త పి.టి., ఉపాధ్యక్షురాలు డాక్టర్ అశ్విని జోషి పి.టి., సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ వంశీకృష్ణ పి.టి., డాక్టర్ కౌసర్ పి.టి.తో పాటు అసోసియేషన్ సభ్యులు, సీనియర్ ఫిజియోథెరపిస్టులు, ప్రగతి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ విద్యార్థులు, అధ్యాపక బృందం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


