Breaking News

BRS కార్యకర్తపై దాడి.. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

పిట్లం, సెప్టెంబర్ 9: (E6tv NEWS: ప్రతినిధి).

మండలంలోని చిల్లర్గి గ్రామానికి చెందిన BRS కార్యకర్త శివపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. దాడిలో గాయపడిన శివకు అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా హన్మంత్ షిండే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు. ప్రజలు అభివృద్ధి చేస్తారని నమ్మి అధికారాన్ని అప్పగించారని, BRS నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడానికి కాదని పేర్కొన్నారు.రాజకీయాల్లో విమర్శలు, అభిప్రాయ భేదాలు సహజమేనని, అయితే భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. BRS కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ పరామర్శ కార్యక్రమంలో మండల BRS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *