కారెక్కిన సీపీఐ సీనియర్ నేత కిలారు ప్రసాద్
పాత కొత్తగూడెం 11వ డివిజన్ నుంచి సుమారు 100 మంది కార్యకర్తల చేరిక
100 మోటార్‌సైకిళ్లతో భారీ ర్యాలీగా తెలంగాణ భవన్‌కు తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు
కొత్తగూడెం, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి).
కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో బుధవారం భారీగా చేరికలు జరిగాయి. ఉమ్మడి సుజాతనగర్ గ్రామపంచాయతీకి చెందిన సీపీఐ సీనియర్ నాయకుడు కిలారు ప్రసాద్ ఆధ్వర్యంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ పాత కొత్తగూడెంకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సమక్షంలో పార్టీలో చేరారు. వారికి ఎంపీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.చేరికల కార్యక్రమానికి ముందు కిలారు ప్రసాద్ ఆధ్వర్యంలో 11వ డివిజన్ పాత కొత్తగూడెం నుంచి సుమారు 100 మోటార్‌సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా తెలంగాణ భవన్‌కు చేరుకున్న నాయకులు, కార్యకర్తలు అనంతరం జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని విమర్శించారు. ప్రస్తుత పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని, తెలంగాణ ప్రజలు తిరిగి కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రైతు పక్షపాతిగా పనిచేసిందని పేర్కొన్నారు. ఆ నమ్మకంతోనే కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీపై విశ్వాసం చూపుతున్నారని తెలిపారు.
బీఆర్ఎస్లో చేరిన కిలారు ప్రసాద్‌తో పాటు ఆయన అనుచరులకు ఎంపీ రవిచంద్ర శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో చర్ల వీరయ్య, పడాల భాస్కర్, మేకల వెంకన్న, గౌడ్ వెంకన్న, నాగేంద్ర, అశోక్, నరేష్, సందీప్, రాకేష్, నాగరాజు, అశ్వద్ధామ, సంజయ్ భార్గవ్, శశి, సాయి వంశీ, ఫణికుమార్, అద్దాల రాము, శ్రీకాంత్, నరసింహ, ఆర్టీసీ రాజు, వంశీ తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, సీనియర్ నాయకులు బీమా శ్రీధర్, మేకల నాగబాబు, కార్పొరేటర్లు బత్తుల మధుచంద్, మల్లెల రవిచంద్ర, గుణచరిత్, ముద్దంగుల మహేష్, జూనియర్ రాజేష్, మాదాసు పద్మ, డీకొండ సునీత, విజయ్, జగన్, సర్పంచ్ బాదావత్ శ్రీకాంత్, బొమ్మిడి రమాకాంత్, కన్ని, బొమ్మిడి శ్రీకాంత్, సంపు, పూసల విశ్వనాథం, సచిన్, కరాటే శీను, వెంకటేష్, తాండ్ర శీను, తోగర్ రాజశేఖర్, ఆనంద్, డాబా శంకర్, నరకట్ర శేఖర్, ఇర్ఫాన్, సేవియా, పెయింటర్ రాజేష్, భూపతి శీను తదితరులు పాల్గొన్నారు.





