కొత్తగూడెం అడ్వకేట్కు దక్కిన అరుదైన ఘనతబెస్ట్ జూనియర్ అడ్వకేట్’గా రాష్ట్రస్థాయి గుర్తింపు
బెస్ట్ జూనియర్ అడ్వకేట్’గా రాష్ట్రస్థాయి గుర్తింపు
పాల్వంచ,సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయవాద రంగానికి మరో విశిష్ట గౌరవం దక్కింది. కొత్తగూడెం పట్టణంలోని ప్యూన్బస్తీకి చెందిన అడ్వకేట్ ఇందిరా ప్రియదర్శిని జిల్లా కోర్టు పరిధిలో ప్రతిభ కనబరిచి బెస్ట్ జూనియర్ అడ్వకేట్ గా ఎంపికయ్యారు. అంతేకాకుండా కాళోజి జయంతిని పురస్కరించుకుని ప్రదానం చేసే ప్రతిష్టాత్మక కాళోజి నంది అవార్డు ను సైతం ఆమె అందుకున్నారు.
వరంగల్లోని కాళోజి ఆడిటోరియంలో బుధవారం రాత్రి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి చేతుల మీదుగా ఇందిరా ప్రియదర్శిని ఈ పురస్కారాన్ని స్వీకరించారు. న్యాయవృత్తిలో ఆమె చూపుతున్న నిబద్ధత, అంకితభావం, ప్రతిభకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య, పలువురు న్యాయవాదులు, పట్టణ ప్రముఖులు ఇందిరా ప్రియదర్శినిని అభినందించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

