Breaking News

పాల్వంచ–కొత్తగూడెం వేదికగా ఆల్ ఇండియా సీనియర్స్ టెన్నిస్ టోర్నమెంట్

సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు పోటీలు

దేశవ్యాప్తంగా 300–400 మంది సీనియర్ క్రీడాకారుల రాక

పాల్వంచ, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ–కొత్తగూడెం జంట నగరాల వేదికగా తొలిసారిగా ఆల్ ఇండియా సీనియర్స్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, శ్యామల గోపాలం ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్ నల్ల సురేష్ రెడ్డి సహకారంతో సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు టోర్నమెంట్ జరగనుంది.

దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 300 నుంచి 400 మంది సీనియర్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. 35+, 45+, 55+, 65+, 70+, 75+ వయో విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.పాల్వంచ మినీ స్టేడియం, శ్రీనివాస్ కాలనీ, కేటీపీఎస్ కాంప్లెక్స్, నవభారత్ కాలనీ, కొత్తగూడెం ప్రగతి మైదానం, సింగరేణి కాలరీస్ టెన్నిస్ కోర్టుల్లో మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలకు పాల్వంచ–కొత్తగూడెం జంట నగరాలు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతానికి క్రీడా రంగంలో ప్రత్యేక గుర్తింపు లభించనుందని నిర్వాహకులు పేర్కొన్నారు. టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.క్రీడాభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జాతీయ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలని నిర్వాహకులు కోరారు.

కార్యక్రమంలో జిల్లా టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ యుగంధర్ రెడ్డి, సెక్రటరీ జాకరయ్య, వైస్ ప్రెసిడెంట్ వై. వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ అన్నం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *