అభివృద్ధికి నోచుకోని స్థితిలో వార్డు ప్రజలు: పుల్లూరి ప్రశాంత్
జమ్మికుంట, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి).
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో పారిశుధ్య నిర్వహణపై అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి, సామాజిక కార్యకర్త పుల్లూరి ప్రశాంత్ ఆరోపించారు. వార్డులో వీధులు సక్రమంగా శుభ్రం చేయడం లేదని, రోడ్ల వెంట పెరిగిన పచ్చిక గడ్డిని తొలగించడం లేదని, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం లేదని పేర్కొన్నారు.వార్డులో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రశాంత్ తెలిపారు. ప్రజలు ఇంటి పన్నులు, నల్ల పన్నులు చెల్లిస్తున్నప్పటికీ వార్డు పట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు.
వార్డులో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రశాంత్ తెలిపారు. ప్రజలు ఇంటి పన్నులు, నల్ల పన్నులు చెల్లిస్తున్నప్పటికీ వార్డు పట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు.పోలీస్ క్వార్టర్స్ పరిధిలో మాత్రం రోడ్లను శుభ్రం చేయడం, గడ్డిని తొలగించడం వంటి పారిశుధ్య పనులు క్రమం తప్పకుండా జరుగుతున్నాయని, అదే స్థాయిలో 16వ వార్డు మొత్తం ఎందుకు పరిశుభ్రంగా ఉంచడం లేదని ప్రశ్నించారు. పాత గ్రామపంచాయతీ నుంచి పోలీస్ క్వార్టర్స్ వరకు మాత్రమే రోడ్డుపై శుభ్రత పనులు చేపడుతున్నారని ఆరోపించారు.
మున్సిపల్ సిబ్బంది వార్డు సమస్యలను పట్టించుకోవడం లేదని, ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన కౌన్సిలర్ సైతం వార్డు వైపు దృష్టి సారించడం లేదని విమర్శించారు. ఇకనైనా అధికారులు స్పందించి వార్డులో పారిశుధ్య పనులను నిరంతరం చేపట్టాలని, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని డిమాండ్ చేశారు.
వార్డులో పరిశుభ్రత సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలతో కలిసి రోడ్డెక్కి ధర్నా చేపట్టాల్సి వస్తుందని పుల్లూరి ప్రశాంత్ హెచ్చరించారు.

