పాల్వంచ, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి).
పాతపాల్వంచ షిర్డీసాయిబాబా దేవాలయం ధర్మకర్త, కేటీపీఎస్ ఫోర్‌మెన్, కార్మిక నాయకుడు ముత్యాల కోటేశ్వరరావు దశదిన కర్మల్లో డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్, మార్క్‌ఫెడ్ రాష్ట్ర మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.
శనివారం పాతపాల్వంచ గడియకట్టలోని కోటేశ్వరరావు స్వగృహానికి కొత్వాల శ్రీనివాసరావు, 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి దంపతులు వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కోటేశ్వరరావు మృతి పట్ల ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేశారు.అనంతరం భద్రాచలం శాంతినగర్‌లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సారపాక బీపీఎల్ రిటైర్డ్ ఉద్యోగి మాతిరెడ్డి రామకృష్ణారావు దశదిన కర్మల్లో కొత్వాల పాల్గొని నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.
అలాగే పాతపాల్వంచ 47వ డివిజన్ రామానందతీర్థ కాలనీకి చెందిన వల్లమల్ల నాగేశ్వరరావు దశదిన కర్మల్లోనూ కొత్వాల పాల్గొని నివాళులర్పించారు. ఆయన సోదరుడు వల్లమల్ల వెంకటరత్నంతో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.ఈ కార్యక్రమాల్లో 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి, మాజీ కౌన్సిలర్ కొత్వాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.




