Breaking News

పాల్వంచ–కొత్తగూడెం వేదికగా జాతీయ స్థాయి టెన్నిస్ టోర్నమెంట్

ఈ నెల 16 నుంచి 22 వరకు నిర్వహణ
కలెక్టర్, ఎస్పీలకు ఆహ్వానం పలికిన జిల్లా టెన్నిస్ అసోసియేషన్

కొత్తగూడెం, సెప్టెంబర్ 12: (E6tv NEWS: ప్రతినిధి).

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ–కొత్తగూడెం వేదికగా ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు జాతీయ స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు జిల్లా టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు యుగంధర్‌రెడ్డి తెలిపారు. శ్యామల గోపాలన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్ నల్లా సురేష్‌రెడ్డి సహకారంతో నిర్వహించనున్న ఈ టోర్నమెంట్‌లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన టెన్నిస్ క్రీడాకారులు పాల్గొననున్నారు.

టోర్నమెంట్‌లో అండర్–35, అండర్–45, అండర్–65, అండర్–75 విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పాల్వంచ శ్రీనివాస కాలనీ మినీ స్టేడియం, కేటీపీఎస్ కాంప్లెక్స్, నవభారత్ కాలనీ, కొత్తగూడెం ప్రగతి మైదానం, సింగరేణి కాలరీస్ టెన్నిస్ కోర్టుల్లో వివిధ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిల్లా టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు యుగంధర్‌రెడ్డి, వైస్‌ప్రెసిడెంట్ వై. వెంకటేశ్వర్లు, కార్యదర్శి జకరయ్య, జాయింట్ సెక్రటరీ అన్నం వెంకటేశ్వర్లు కలిసి జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్‌రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. టోర్నమెంట్‌కు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులను ప్రోత్సహించాలని వారిని ఆహ్వానించారు.

జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలు జిల్లాలో నిర్వహించడం ద్వారా స్థానిక క్రీడాకారులకు ప్రోత్సాహం లభించడంతో పాటు జిల్లాకు క్రీడా రంగంలో మరింత గుర్తింపు లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *