Breaking News

మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష

మద్నూర్: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మద్నూర్ ఎస్‌ఐ మోహన్‌రెడ్డి హెచ్చరించారు. మద్నూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఆరుగురు పట్టుబడ్డారు.

పోలీసులు కేసులు నమోదు చేసి నిందితులను బిచ్కుంద కోర్టు–II మేజిస్ట్రేట్ చంద్రకళ ఎదుట హాజరుపరిచారు. కేసును విచారించిన మేజిస్ట్రేట్ ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ.500 చొప్పున జరిమానా, మరో ముగ్గురికి ఒక్కొక్కరికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.1,000 చొప్పున జరిమానా విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు. అనంతరం ఆరుగురిని రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల డ్రైవర్‌తో పాటు రోడ్డుపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉంటుందని అన్నారు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగి కుటుంబాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.

మద్యం సేవించిన వారు వాహనాలు నడపకుండా ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని, పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. “మద్యం సేవించి వాహనం నడపకండి.. మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడండి” అని పోలీసులు ప్రజలకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *