అసెంబ్లీలో రచ్చ: బీజేపీ ఆందోళనతో సభ వాయిదా
హైదరాబాద్ (E6TV): తెలంగాణ శాసనసభలో 22ఏ (నిషేధిత భూముల) అంశం తీవ్ర దుమారం రేపింది. రాష్ట్రంలో జరుగుతున్న భూ దందాలు, నిషేధిత జాబితాలో భూముల కేటాయింపులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శాసనసభ్యులు సభలో ఆందోళనకు దిగారు. వాయిదా తీర్మానంపై పట్టు: ఉదయం సభ ప్రారంభం కాగానే 22ఏ భూముల అంశంపై బీజేపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఆమోదించి వెంటనే చర్చ చేపట్టాలని పట్టుబట్టారు. అయితే, ఈ సమస్యపై చర్చించేందుకు ప్రభుత్వం…

