Breaking News

Shiv Thakur

వైఎస్సార్‌కు ఘన నివాళులు

నిజాంసాగర్ సెప్టెంబర్ 2:(E6tv NEWS ప్రతినిధి). పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు.కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల…

Read More

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ సమరభేరి

సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు హుజూరాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా వారం రోజుల నిరసన కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చిన 420 హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్,ఆగస్టు 31: (E6tv NEWS: ప్రతినిధి) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక…

Read More

రాఖీ పండుగ సందర్భంగా టీజీఎస్‌ఆర్టీసీ విశేష సేవలు

మూడు రోజుల్లో 216 ప్రత్యేక బస్సులు.. 655 బస్సులతో ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణా నిజామాబాద్, ఆగస్టు 31:(E6tv NEWS: శివ ఠాకూర్). రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ విస్తృత ఏర్పాట్లు చేసి ప్రత్యేక బస్సులను విజయవంతంగా నడిపింది. నిజామాబాద్ రీజియన్ పరిధిలోని నిజామాబాద్-1, నిజామాబాద్-2, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, కామారెడ్డి మొత్తం ఆరు డిపోల పరిధిలో ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించినట్లు రీజినల్ మేనేజర్ తెలిపారు.రాఖీ…

Read More

గణేష్ మండపాల వద్ద విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి

గణేష్ ఉత్సవాల సన్నాహక సమావేశంలో సమస్యలను ప్రస్తావించిన బిచ్కుంద ప్రతినిధులు కామారెడ్డి, ఆగస్టు 31:(E6tv NEWS: ప్రతినిధి).రాబోయే వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల సన్నాహక సమావేశం నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గణేష్ మండపాల నిర్వాహకులు, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బిచ్కుంద మండలం నుంచి సమావేశానికి హాజరైన శెట్పల్లి విష్ణు గణేష్…

Read More

బాల్కొండలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి

నియోజకవర్గ కేంద్రాన్ని కాదని మారుమూల గ్రామాన్ని ఎలా ఎంపిక చేస్తారు? జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించిన మన హక్కుల కౌన్సిల్ ప్రతినిధులు బాల్కొండ, ఆగస్టు 31:(E6tv NEWS:ప్రతినిధి).బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతూ మన హక్కుల కౌన్సిల్ సామాజిక, సాంస్కృతిక విభాగం ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కౌన్సిల్ ప్రతినిధులు సమాచార హక్కు చట్టం కింద రెండో అప్పీల్‌కు సంబంధించిన వినతిపత్రాన్ని…

Read More

సంక్షేమ హాస్టళ్లలో మేస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి

విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: ఏఐపీఎస్‌యూ బోధన్, ఆగస్టు 31:(E6tv NEWS: ప్రతినిధి). సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం మేస్, కాస్మోటిక్ ఛార్జీలను తక్షణమే పెంచాలని అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) డిమాండ్ చేసింది.AIPSU బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్సీ సంక్షేమ హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా AIPSU బోధన్ డివిజన్…

Read More

దినేష్ కులచారి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు

జక్రాన్‌పల్లి, ఆగస్టు 31:(E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జక్రాన్‌పల్లి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా దినేష్ కులచారి సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని శ్రీ శివలింగేశ్వర స్వామివారిని ప్రార్థించారు. అనంతరం అంకాపూర్‌లోని లాలన వృద్ధాశ్రమాన్ని సందర్శించి…

Read More

ఆర్టీసీ బస్సులో భద్రత గాలికేనా..?

బాన్సువాడ డిపో ఎక్స్‌ప్రెస్‌ బస్సులో ప్రమాదకర పరిస్థితులు TS16UC3338 బస్సు లో ఉన్న ప్రయాణికుల ఆందోళన.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ నిజామాబాద్ ఆగస్టు 31:(E6tv NEWS: శివ ఠాకూర్). ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ఆర్టీసీ బస్సుల్లోనే భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాన్సువాడ డిపోకు చెందిన TS16UC3338 ఎక్స్‌ప్రెస్‌ బస్సులో ప్రయాణికులకు ప్రమాదకరంగా మారే పరిస్థితులు ఉన్నాయంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్సులో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు కాలు పెట్టే ప్రదేశాల్లో ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయని,…

Read More

మానాల ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాన్ని పరిశీలించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

మూడు నెలల్లో మిగిలిన పనులు పూర్తి చేయాలి: ఇంజనీరింగ్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం విశాలమైన భవనంలోకి పాఠశాలను తరలిస్తే విద్యార్థులకు మెరుగైన వసతులు గిరిజన విద్యార్థులకు ఎంతో ప్రయోజనం: వేముల ప్రశాంత్ రెడ్డి మానాల,ఆగస్టు 31:(E6tv NEWS: ప్రతినిధి) మానాల మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నూతన భవన నిర్మాణ పనులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనులు నెమ్మదిగా కొనసాగుతుండటంపై ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారుభవన…

Read More

SIR ఫేజ్–2పై BLAలు, సూపర్వైజర్లకు శిక్షణ

మోర్తాడ్, ఆగస్టు 30:(E6tv NEWS: ప్రతినిధి). బాల్కొండ నియోజకవర్గ స్థాయి BLAలు (బూత్ లెవెల్ ఏజెంట్లు), BLA సూపర్వైజర్లకు SIR ఫేజ్–2పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని RNB ఫంక్షన్ హాల్‌లో ఈ సమావేశం జరిగింది.కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్, SIR ఇంచార్జ్ ఊట్ల వరప్రసాద్ హాజరై BLAలు, సూపర్వైజర్లకు SIR ప్రక్రియపై అవగాహన కల్పించారు. SIR ఫేజ్–2లో భాగంగా నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు BLO…

Read More