Breaking News

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం

కొత్తగూడెం, సెప్టెంబర్ 11: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద ఆమె చిత్రపటానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ ధైర్యం, ఆత్మగౌరవం, పోరాట పటిమ తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమన్నారు. సామాజిక అన్యాయం, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా…

Read More

కేటీఆర్, హరీష్ రావుపై కేసులు కక్ష సాధింపే

కాంగ్రెస్ సర్కారుకు మ్యాటర్ వీక్.. పబ్లిసిటీ పీక్ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి: జీవన్ రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అసెంబ్లీలో బీఆర్ఎస్ పక్ష ఉపనేత హరీష్ రావుపై నమోదైన లైంగిక వేధింపుల కేసులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపులో భాగమేనని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆరోపించారు.గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Read More

ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీకి ‘సై’

శిల్పినగర్, కేజీబీవీ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం భద్రాచలం ఎంఈఓ బెక్కంటి శ్రీనివాసరావు భద్రాచలం, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తూ విద్యార్థి కేంద్రంగా బోధన అందిస్తున్నామని భద్రాచలం మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాసరావు అన్నారు. శిల్పినగర్ ప్రాథమిక పాఠశాల, కేజీబీవీ భద్రాచలం విద్యార్థులు చురుకుగా, ఉత్సాహంగా విద్యను అభ్యసిస్తూ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీకి తాము సైతం సిద్ధమంటున్నారని తెలిపారు. గురువారం భద్రాచలం పట్టణంలోని శిల్పినగర్…

Read More

భూ రీ-సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

సీతాయిగూడెంలో రీ-సర్వే పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్ అర్హులైన భూహక్కుదారులకు పాస్‌బుక్‌లు పొందే అవకాశం చండ్రుగొండ, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).భూ రీ-సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. చండ్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామంలో కొనసాగుతున్న భూ రీ-సర్వే ప్రక్రియను గురువారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, ప్రక్రియను వేగవంతంగా, పూర్తి ఖచ్చితత్వంతో నిర్వహించాలని ఆదేశించారు. గ్రామ…

Read More

ఓటర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన

మద్నూర్, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా మద్నూర్ తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఓటర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన శిబిరం నిర్వహించారు. వివిధ కారణాలతో నోటీసులు అందుకున్న ఓటర్లు శిబిరానికి హాజరై, తమ తల్లిదండ్రులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అధికారులకు సమర్పించారు.నోటీసుల్లో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా ఓటర్లు అందజేసిన ధ్రువీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. ఈ ప్రక్రియలో అర్హత, పత్రాల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేస్తున్నారు. నోటీసులు అందుకున్న ఓటర్ల ధ్రువీకరణ పత్రాల…

Read More

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కలిసిన వి. పార్వతి హాథీరామ్ నాయక్

భద్రాచలం, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాచలంలోని ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను బీజేపీ టీచర్స్ సెల్ జిల్లా కన్వీనర్, గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వి. పార్వతి హాథీరామ్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ను శాలువా, బొకేతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, గిరిజన రైతులకు రావాల్సిన పోడు…

Read More

సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలి

నిజామాబాద్, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి) సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ఇందూర్ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.1948 సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రాంతం విముక్తి పొంది భారతదేశంలో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని ప్రజలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ విమోచన కోసం పోరాడిన రైతులు, మహిళలు, యువకులు, సామాన్య ప్రజల…

Read More

సేవాలాల్ సేన 12వ వార్షికోత్సవం ఘనంగా

మద్రాస్ తండలో జెండా ఆవిష్కరణ.. బంజారా సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలి టేకులపల్లి, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మద్రాస్ తండ గ్రామంలో సేవాలాల్ సేన 12వ వార్షికోత్సవ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు భూక్య సంజీవ్ నాయక్, రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జెండా ఆవిష్కరణ చేపట్టారు.సేవాలాల్ సేన సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన…

Read More

గణేష్ ఉత్సవాల్లో నిబంధనలు తప్పనిసరి

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ కొత్తగూడెం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రజలకు సూచించారు. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.గణేష్ మండపాల నిర్వాహకులు మండపం ఏర్పాటు చేసే ముందు పోలీసులకు సమాచారం అందించడంతో పాటు పోలీసు శాఖ రూపొందించిన ఆన్‌లైన్ పోర్టల్‌లో…

Read More

ఎన్నికల హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్‌ను వదలం

కలెక్టర్ కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన పాల్వంచ, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి). కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేసే వరకు ఆ పార్టీని వదిలేది లేదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని ఎండగడుతూనే ఉంటామని హెచ్చరించారు.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ బీఆర్ఎస్ శ్రేణులు కలెక్టర్…

Read More