Telangana
వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధుల ముప్పు…!
జ్వరం, డెంగ్యూ, వైరల్ ఇన్‌ఫెక్షన్లు.. అప్రమత్తంగా లేకపోతే ప్రమాదమే..! ఉక్కపోత, చిరుజల్లులతో వైరస్‌ల వ్యాప్తికి అనుకూల పరిస్థితులు పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్యుల హెచ్చరిక పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత జాగ్రత్తలతోనే సీజనల్ వ్యాధులకు చెక్ స్వయంగా మందులు వాడొద్దు.. లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి ప్రత్యేక కథనం నిజామాబాద్, జూలై 12 | E6 న్యూస్ ప్రతినిధి : శివ ఠాకూర్ తెలంగాణలో వాతావరణ పరిస్థితులు రోజురోజుకూ మారుతున్నాయి….
అశోక్ సాగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
లారీ ఢీకొని తల్లి మృతి.. కుమారుడికి తీవ్ర గాయాలు నిజామాబాద్, జూలై 12 (E6 క్రైమ్ న్యూస్):నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఆదివారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జానకంపేట్ గ్రామ సమీపంలోని అశోక్ సాగర్ వద్ద బోధన్–నిజామాబాద్ ప్రధాన రహదారిపై లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. జానకంపేట్ గ్రామానికి చెందిన మారా కమల తన కుమారుడు అవీష్‌తో కలిసి…
కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బిఆర్ఎస్ నేతలు
కోటగిరి జూలై 12 :E6 న్యూస్:కోటగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ప్రాజెక్టుపై జరుగుతున్న దుష్ప్రచారాలను ఖండిస్తూ, తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ప్రాజెక్టును సమర్థవంతంగా వినియోగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని సాగునీటి అవసరాలను తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ఉపయోగించి, రైతులకు తక్షణమే సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని…
తెలంగాణకు ఎండల ఎఫెక్ట్…!
జూలై 15 వరకు పొడి వాతావరణం కొనసాగే సూచనలు 16-19 మధ్య అక్కడక్కడా తేలికపాటి ఉరుములు, జల్లులు మాత్రమే..! హైదరాబాద్, జూలై 12: E6 న్యూస్తెలంగాణలో జూలై రెండో వారం నుంచి వాతావరణం అసాధారణంగా వేడిగా మారింది. సాధారణంగా ఈ సమయంలో విస్తారంగా వర్షాలు కురవాల్సి ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలను తలపించేలా నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు. నేడు నమోదయ్యే ఉష్ణోగ్రతలు వాతావరణ పరిస్థితులపై అందుబాటులో ఉన్న…
పేదల ఆరోగ్యానికి పెద్దపీట నిమ్స్ చికిత్సకు రూ. 5 లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
ఇందూరు, జూలై 12: E6 న్యూస్ శివ ఠాకూర్ నియోజకవర్గంలోని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, అవసరమైన వారికి నిమ్స్‌లో చికిత్స కోసం ఎల్వోసీలు (LOC) మంజూరు చేస్తున్నామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు.ఆదివారం నగరంలోని తన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆటోనగర్‌కు చెందిన మూడున్నరేళ్ల చిన్నారి ఉమ్మే కుర్సుం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండటంతో ఆమె చికిత్స నిమిత్తం రూ.5 లక్షల విలువైన ఎల్వోసీని కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే…
గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైంది: అమరవేణి నర్సాగౌడ్ హుస్నాబాద్ జూలై 11: E6 న్యూస్ గౌడ కులస్తులకు ఎన్నిక సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి “మోకు దెబ్బ” జాతీయ అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ డిమాండ్ చేశారు.గౌడ కులస్తులకు ఎన్నిక సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి “మోకు దెబ్బ”…
E6TV బ్రేకింగ్ న్యూస్ గాన కోకిల ఎస్ జానకి ఇక లేరు దక్షిణ భారత సంగీత ప్రపంచంలో తీరని లోటు..
భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. దశాబ్దాల పాటు తన అమృత గాత్రంతో కోట్లాది మంది శ్రోతలను మైమరపించిన లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్, దక్షిణ భారత గాన కోకిల ఎస్ జానకి (శిష్ట్లా జానకి) శనివారం కన్నుమూశారు. 88 సంవత్సరాల వయసున్న జానకి అమ్మ, వయోసహజ అనారోగ్య సమస్యల కారణంగా మైసూర్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మరణవార్తను కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె…
మహిళ మెడలో నుంచి మంగళసూత్రం చోరీ.. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్, జూలై 11: E6 న్యూస్ క్రైమ్ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టౌన్-3 పోలీస్ స్టేషన్ పరిధిలో దుబ్బ ప్రాంతంలో మహిళ మెడలో నుంచి మంగళసూత్రం, కమ్మలు అపహరించిన ఘటనపై పోలీస్ కమిషనర్ పీ. సాయి చైతన్య, ఐపీఎస్ శనివారం సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితురాలితో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్న కమిషనర్, దర్యాప్తు అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ…
హుస్నాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి గౌడ సంఘం సమావేశానికి పెద్ద ఎత్తున హాజరు కావాలి.
పెద్ద ఎత్తున మమేకమై, గౌడ సంఘాల ఐక్యతను చాటాలి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు చేపూరి కనక గౌడ్ పిలుపు నిర్మల్, జూలై 12: E6న్యూస్ తిరుపతి గౌడ్:హుస్నాబాద్‌లో ఆదివారం నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి గౌడ సంఘం సమావేశాన్ని విజయవంతం చేయాలని నిర్మల్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు చేపూరి కనక గౌడ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి గౌడ సంఘం నాయకులు, ప్రతినిధులు, గౌడ సోదరులు ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు….
తాళ్ల రాంపూర్ సర్పంచ్ పావని కుటుంబాన్ని పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి
ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు భరోసా పావని మరణం గ్రామానికి తీరని లోటు : మానాల మోహన్ రెడ్డి ఏర్గట్ల జూలై 11: E6 న్యూస్ తాటికొండ గంగాధర్బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ కీర్తిశేషులు బెజ్జారం పావని ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర సహకార సంఘం చైర్మన్ మానాల మోహన్ రెడ్డి శనివారం పావని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా…

