Breaking News

ఎంపీ అరవింద్‌పై విమర్శలు చేస్తే ఊరుకోం

బీజేపీ కార్పొరేటర్ల హెచ్చరిక నిజామాబాద్ ఆగస్టు 18: (E6tv NEWS: శివ ఠాకూర్) నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలను బీజేపీ కార్పొరేటర్లు తీవ్రంగా ఖండించారు. ఎంపీ అరవింద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీజేపీ శ్రేణులు చూస్తూ ఊరుకోవని 35వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుధీర్ హెచ్చరించారు.జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎర్రం సుధీర్, 22వ డివిజన్ కార్పొరేటర్ సాయి వైష్ణవి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాకు తగినన్ని…

Read More

రూ. 1.5 కోట్ల విలువైన హ్యాషిష్ ఆయిల్‌ స్వాధీనం: ఐటీ ఉద్యోగి సహా ఆరుగురు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌ నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న 12 కేజీల హ్యాషిష్ ఆయిల్‌ను (విలువ సుమారు ₹1.5 కోట్లు) మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ సూచనా విభాగాలు (SOT), వనస్థలిపురం పోలీసులు పట్టుకున్నారు. చింతలకుంట వద్ద సోమవారం తెల్లవారుజామున నిర్వహించిన తనిఖీల్లో ఓ ఐటీ మహిళా ఉద్యోగి, ఇద్దరు మైనర్లు (17 ఏళ్లు) సహా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి వెల్లడించారు. వివరాలు & నేర శైలి: ఈ కేసులో సప్లయర్…

Read More

పాఠశాలల ఆరోగ్యం బలోపేతానికి ప్రత్యేక చర్యలు

నిజామాబాద్, ఆగస్టు 17: (E6tv NEWS: శివ ఠాకూర్). జిల్లాలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (RBSK)పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ RBSK మొబైల్ హెల్త్ టీంలు ప్రతి పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆరు నెలలకు ఒకసారి…

Read More

వందేమాతరం గీతం ప్రతి భారతీయుడి గుండెల్లో నిలవాలి

నిజామాబాద్, ఆగస్టు 17: (E6 tv NEWS: శివ ఠాకూర్). బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట సోమవారం వందేమాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో వందేమాతరం గీతం కీలక పాత్ర పోషించిందన్నారు. 1905 బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందేమాతరం గీతం రణనినాదంగా మారి ప్రజలను చైతన్యవంతం చేసిందని తెలిపారు. బంకించంద్ర చటర్జీ దూరదృష్టితో వందేమాతరం…

Read More

కళ్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలి: వేముల ప్రశాంత్ రెడ్డి

వేల్పూర్, ఆగస్టు 17: (E6tv NEWS,T. గంగాధర్) కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని, ఎన్నికల హామీ మేరకు కళ్యాణలక్ష్మి ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం అందించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ వేల్పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం…

Read More

వరి రకాల బోనస్‌పై ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణ రైతుల్లో వ్యతిరేకత

సన్న రకం వరి ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన ₹500 బోనస్‌ను కేవలం 7 రకాల (Varieties) విత్తనాలకు మాత్రమే పరిమితం చేయడాన్ని తెలంగాణలోని పలువురు రైతులు వ్యతిరేకిస్తున్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన రసీదులు (Bills) ఉంటేనే బోనస్ వర్తింపజేస్తామన్న ప్రభుత్వ నిబంధన తమకు అన్యాయం చేసేలా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల అభ్యంతరాలు – ప్రధాన కారణాలు: ప్రభుత్వం నిర్ణయించిన 7 సన్న రకాల జాబితా: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరతో (MSP)…

Read More

కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్‌పై స్టే.. బీఆర్ఎస్ ధర్నా వెనుక అసలు కథ ఏమిటి?

పేదింటి ఆడబిడ్డల పెళ్లి సాయంపై న్యాయపరమైన ప్రతిష్టంభన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో లబ్ధిదారుల్లో ఆందోళన.. ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలు పథకం రద్దు కాలేదా? స్టే మాత్రమేనా? అసలు వివాదం ఏమిటి? నిజామాబాద్, ఆగస్టు 17: E6tv NEWS (శివ ఠాకూర్). తెలంగాణ లో పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచే కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాలు ప్రస్తుతం రాజకీయ, న్యాయపరమైన చర్చకు కేంద్రంగా మారాయి. ఈ పథకాల అమలుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు ఇటీవల మధ్యంతర…

Read More

మాజీ సర్పంచ్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న హన్మంత్ షిండే

పిట్లం, ఆగస్టు 16: (E6 tv NEWS: ప్రతినిధి) పిట్లం మండలం రాంపూర్ (కలాన్) మాజీ సర్పంచ్ మందాడి నారాయణ రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే హాజరై నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ఆయనతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నూతన గృహంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు…

Read More

బాడాపహాడ్ కమాన్ నిర్మాణానికి భూమి పూజ

వర్ని, ఆగస్టు 16: (E6tv NEWS: ప్రతినిధి) వర్ని మండల కేంద్రంలోని బాడాపహాడ్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మించనున్న బాడాపహాడ్ కమాన్ (స్వాగత తోరణం) నిర్మాణ పనులకు మాజీ డీసీసీబీ చైర్మన్  పోచారం భాస్కర్ రెడ్డి భూమి పూజ చేశారు.స్థానిక నాయకులతో కలిసి ఆయన కమాన్ నిర్మాణ స్థలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. బాడాపహాడ్ చౌరస్తా వద్ద నిర్మించనున్న ఈ స్వాగత తోరణం వర్ని పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని నాయకులు తెలిపారు. ఈ…

Read More

బీజేపీ, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు

బాల్కొండ నియోజకవర్గంలో 100 మంది కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరిక కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్: ఆగస్టు 16: (E6tv NEWS: ప్రతినిధి). ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి తిరిగి గాడిన పడాలంటే…

Read More